Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఇటీవల నగరంలో రాడిసన్ హౌటల్లో జరిగిన పర్ఫెక్ట్ 360 ఎమినెంట్ అవార్డుల వేడుకలో యూట్యూబర్ ఓకేసాయికి యువ ఇన్ఫ్లుయెన్సుర్ అవార్డు దక్కింది. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా యువతను, ఉద్యోగాన్వేషణలో ఉన్న వారిని ఉత్తేజపరుస్తున్న ఒక యువకుడు కేవలం రెండు పదుల వయస్సులోనే తన పేరుమీద ''ఓకేసాయి'' ఛానల్ మొదలు పెట్టి దాదాపు రెండున్నర లక్షలకు పైగా సబ్స్క్రై బర్స్, లక్షలాది వ్యూస్, అనూహ్య ఎంగేజ్మెంట్తో ఓకే సాయి ఒక అగ్రగామి యువ-ఇన్ఫ్లుయెన్స్ర్గా రాణిస్తు న్నారు. ఇంట్లోనే ఉంటూ ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బు ఎలా సంపాదించాలి? అనే అంశాలపై అతని వీడి యోస్ సంచలనమవుతున్నాయి. డ్రాప్-షిప్పింగ్, అఫిలి యేట్ మార్కెటింగ్, ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకో వాలి, రెసుమెని తయారు చేసుకుని ఉద్యోగ నియామకాల్లో ఎలా వికసించాలనే వివరణాత్మక విషయాలను తన విడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. యువతకు, ఇంట్లోనే ఉంటూ ఆదాయం పొందాలనుకునే వారికి, గృహి ణులకు, పలువురు ఔత్సాహికులకు ఓకేసాయి వీడియోలు మార్గదర్శకంగా ఉంటున్నాయి. ఎమెసెమీలో రిజిస్టర్ చేయబడిన 'ఓకేసాయి ఎడ్టెక్ కంపెనీ' ద్వారా డిజిటల్ మార్కెటింగ్ కోర్సుని అందిస్తూ చాలా మందికి సహాయక రంగా ఉంటున్నారు. యువశక్తి నిర్వీర్యం కాకుండా వ్యక్తిగత, దేశ ఆర్థిక ప్రగతికి ఎలా దోహదపడాలనే ప్రేరణ ను కలిగిస్తూ, ప్రతినెలా దాదాపు రూ.5 లక్షలు తన ఛానల్ ద్వారా, అఫిలియేట్ మార్కెటింగ్, ప్రచారాంశాలు, పైడ్ ప్రోమోషన్స్ ద్వారా సంపాదిస్తూ తన చుట్టూ ఉన్న వారికి, వ్యూయర్స్, ఫాల్లోవెర్సకి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.