Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
ఇంటి ముందు నిలిపిన కారు తీయ మని చెప్పిననందుకు ఎమ్మెల్యే అనుచరులు ఓ దళిత నేతను దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు యత్నించిన పలువురిపై అట్రా సిటీ కేసు నమోదైంది. బాలానగర్ సీఐ కె. భాస్కర్ వివరాల ప్రకారం ఐడీపీఎల్ కాలనీ ఆదర్శనగర్‌లోని సౌభాగ్య నగర్లో నివాసం ఉంటున్న జాతీయ దళిత సంక్షేమ సంఘం ఉపా ధ్యక్షుడు బూదాల బాబూరావు ఇంటి ముందు నిలిపిన ఎమ్మెల్యే అనుచ రుల కారును పక్కన తీయమని చెప్పిన కారణంగా తాము కుత్బు ల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ అనుచరులమంటూ పరుష పద జాలంతో దూషిస్తూ ఆదర్శ నగర్‌కాలనీ అధ్యక్షులు విజరు కుమార్, శంకర్, శ్రీనివాస్ మరి కొందరు మద్యం మత్తులో దళిత నేతపై రాయడానికి వీలులేని బూతులు మాట్లాడుతూ ఎవరికి చెప్పుకుంటావ్, ఏం చేస్తావంటూ అంటూ రభస చేశారు. జరిగిన విషయాన్ని బాలానగర్ పోలీసులకు బాబూరావు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.