Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంతకర్త, ఉద్యమకర్త ప్రొఫెసర్ జయశంకర్సర్ వర్ధంతి సభను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖులు, ఉద్యమకారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రజా సంఘాల నాయకులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వారు చేసిన కృషి, వారి పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
నవతెలంగాణ-దుండిగల్
జయశంకర్ వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్ మూడు కోతుల బొమ్మ చౌరస్తావద్ద జయశంకర్ సర్ చిత్రప టానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ రాములు నాయక్, నర్సింగరావు, సెక్రటరీ సాంబశివరరెడ్డి, దండుగల స్వామి, డివిజన్ ప్రెసిడెంట్ బిక్షపతి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
బోడుప్పల్ : త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించు కున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివద్ధి చేయడమే ఆచార్య జయశంకర్ సర్‌కు మనం అందించే ఘన నివాళి అని టీఆర్ఎస్ యువజన నాయకుడు వర్కాల శివ కిషోర్‌గౌడ్ అన్నారు. బోడుప్పల్ ఇందిరా నగర్ చౌరస్తా లో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సర్ పాత్ర మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు కుమార్, నవీన్ గౌడ్, రాజు, వంశీ గౌడ్, రాకేష్ పాల్గొని నివాళులర్పించారు.
దుండిగల్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ రాజీవ్ గృహకల్ప కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్సర్ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గహకల్పలోని జయశంకర్సర్ విగ్రహానికి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆవుల జగదీష్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ 31వ డివిజన్ అధ్యక్షులు తోట బిక్షపతి, ఎల్లారెడ్డి, సత్యనారాయణ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
నేరెడ్మెట్ : ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్ర మం అల్వాల్ సర్కిల్లో జేఏసీ ప్రాంగణంలో నిర్వహిం చారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రాజ్ జితేంద్ర నాథ్ కలిసి జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి, విగేశ్వర రెడ్డి, ఉదరు కుమార్, బలవంత రెడ్డి, ప్రవీణ్, జ్యోతి, కవిత,బబితా, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి : ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సంద ర్భంగా వివేకానంద రైసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని, గౌతమ్ నగర్ వీధి నెంబర్ 28లో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద హిస్టరీ సొసైటీ అధ్యక్షుడు కుమ్మరి రాజు, మొహమ్మద్ రషీద్, జగపతి, రాము, నిరంజన్, మహ మ్మద్ సమి, విజయ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
కాప్రా : జయశంకర్ వర్థంతిని పురస్కరించుకుని మల్లా పూర్ లోని వార్డ్ ఆఫీస్‌లో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి డివిజన్ నాయకులతో కలిసి నివాళ్లర్పి ంచారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.