Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
అల్వాల్ సర్కిల్ సుభాష్ నగర్ హనుమాన్ ఆలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. గుడి స్థలం కబ్జా చేసి, గుడికి దారి లేకుండా చేసినందుకు నిరసన వ్యక్తం చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పాల్గొని మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరిం చాలని కోరారు. కంటోన్మెంట్ అధికారులు, హుడా అధికారులు సమస్యను పరిష్కరించి వెంటనే హను మాన్ గుడికి దారి ఇవ్వాలని కోరారు. అధికారులు సానుకూలంగా స్పందించడంతో నిరసన విరమించా రు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సబిత అనిల్ కిషోర్ గౌడ్, శాంతి శ్రీనివాస్ రెడ్డి, రాజ్ జితేందర్ నాథ్, మల్కాజిగిరి కంటోన్మెంట్ నియోజక వర్గాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.