Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ ప్లాగ్ షిప్ బ్రాండ్ సోనాలికా యాన్మార్, ప్రపంచ వ్యాప్తంగా తన మార్కెట్‌ను గణనీయంగా విస్తరిస్తుంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ట్రాక్టర్ మార్కెటైన టర్కీలో 2013లో గ్రాండ్‌గా అరంగ్రేటం చేసిన తర్వాత, ప్రీమియం ట్రాక్టర్ బ్రాండ్ ఇప్పుడు దేశంలో నెంబర్ వన్ ఎగుమతుల స్థానాన్ని బలంగా కలిగి ఉంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్రాక్టర్ శ్రేణితో నడిచే ఈ సంస్థ టర్కీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ కూడా. పెరుగుతున్న మార్కెట్ తీరుపై సోనాలికా యాన్మార్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ మాట్లాడుతూ ''టర్కిష్ పొలాల్లో విజయవంతంగా నడుస్తున్న సోలిస్ ట్రాక్టర్ల 5వేల మందికిపైగా కస్టమర్లతో మాది సగర్వంగా సంతోషకరమైన కుటుంబం. నెంబర్ వన్ ఎగుమతుల బ్రాండ్ పొజిషన్‌ను బలంగా కలిగి ఉన్నప్పుడు టర్కీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ట్రాక్టర్ బ్రాండ్ అని పంచుకోవడం మాకు సంతోషంగా ఉంది. టర్కీస్ మార్కెట్ 30-90 హెచ్‌పీ మధ్య ట్రాక్టర్‌కు భారీ డిమాండ్ కలిగి ఉంది. ఇది మా సోనాలిస్ 50 అండ్ సోలిస్ 90 మాకు స్టార్ ఉత్పత్తులుగా మారుతుంది. మా ఎస్-26 మోడల్ 2021 క్యాలెండర్ సంవత్సరంలో 88శాతం వాటాను కలిగి ఉంది. మొత్తం మీద మేం టర్కీలో 8శాతం వాటా మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఏడాది మార్చిలో వరుసగా జరిగిన ఇజ్మీర్ అండ్ కోన్యా నేషనల్ ఫెయిర్లలో 75 హెచ్‌పీ సీఆర్డీఐ ట్రాక్టర్‌ను ఆవిష్కరించాం'' అని తెలిపారు.