Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రతి భారతీయుడూ గర్వించేలా ఆపి (అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్) 40వ వార్షిక సమావేశాన్ని టెక్సస్ రాష్ట్రం శాన్ అంటోనియో నగరంలో ఈ నెల 23-26వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు అధ్యక్షులు డాక్టర్ అనుపమ గొటిముకుల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సు భారతీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతు న్నామనీ, ఇందుకు కన్వెన్షన్ చైర్ డాక్టర్ జయేష్ షా, సీఈఓ అడివి వెంకీ భారతదేశంలో వైద్యవిద్యను అభ్యసించి ఉన్నత చదువులు, పరిశోధనల నిమిత్తం తొలినాళ్ళలో అమెరికా వెళ్ళిన వాళ్ళు అనేక రకాలైన వివక్షలకు గురయ్యారన్నారు. వాటిని అధిగమించి గౌర వంగా అమెరికా రాష్ట్రాల్లో నిలబడటానికి వైద్యులం తా కలిసి 1980లో ఏర్పాటు చేసుకున్నదే ఆపి అన్నారు.
డాక్టర్ దువ్వూరు ద్వారకనాథరెడ్డికి ప్రత్యేక పురస్కారం
ఆపి సంస్థకు భారతదేశంలో అత్యున్నతమైన సేవల్ని అందిస్తున్నందుకు ప్రముఖ వైద్యనిపుణులు, ఆపీ ఓవర్సీస్ కో-ఆర్డినేటర్డా క్టర్ దువ్వూరు ద్వారకా నాథరెడ్డికి స్పెషల్ సర్వీస్ అవార్డును అందించి శాన్ అంటోనియో వేదిక మీద ఘనంగా సత్కరిస్తున్నామని అధ్యక్షురాలు అనుపమ గొటిముకుల వెల్లడించారు. ఈ సదస్సులో విభిన్న రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆహ్వా నించి సత్కరిస్తున్నామనీ, వారిలో క్రికెట్ లెజెండ్ సునీల్గ వాస్కర్, డాక్టర్ రాహుల్ గుప్త, డైరెక్టర్ నేషనల్ డ్రగ్ కంట్రోల్ పాలసీ, డాక్టర్ సౌజన్య మోహన్ టెక్సస్ గ్రూప్, ప్రైమ్ హెల్త్ కేర్ సీఈఓ డాక్టర్ ప్రేమ్ కుమార్ రెడ్డి, సైంటిస్ట్ పీటర్ జె.హెటెజ్, సాధ్వి భగవతి సరస్వతి, అష్టాంగయోగ పరమగురు శరత్ జాయిన్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జాక్ రెస్నెక్ జూనియర్లను సత్కరిస్తున్నామన్నారు. ఈరోజున అమెరికా నగరంలో లక్ష మంది వైద్యులకు అండగా, వెనుదన్నుగా నిలిచిందన్నారు. ఆపి ద్వారా ప్రజలందరికీ సమానమైన వైద్య సౌకర్యాలను ప్రభు త్వాలు కల్పించాలని అమెరికా, భారత ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఫిజీషియన్స్ ప్రధానంగా ఎదుర్కొంటున్న మెడికేర్ పేమెంట్ కట్స్ గురించి, ఇమ్మిగ్రేషన్ అంశాలలో ప్రధానమైన గ్రీన్ కార్డ్ బ్లాకేజ్ గురించి అమెరికాలోని చట్టసభల ప్రతినిధులతో చర్చించినట్టు తెలిపారు.