Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాగునీరు కలుషితం కాకుండా చూడాలి
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
వర్షాకాలంలో బోరబండ సైడ్ 3, రహ్మత్ నగర్ డివిజన్లలో తాగునీరు మురికి నీరుగా మారుతుందని, వెంటనే ఫిర్యాదు చేసినా, చేయకపోయినా యుద్ధ ప్రాతిపదికన మోరీలు శుభ్రం చేయించి వెంటనే మట్టిని తొలగించాలని వాటర్ వర్క్స్ మేనేజర్ రవీందర్‌కు, స్థానిక సీపీఐ(ఎం) నాయకులు సాయి శేషగిరిరావు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయి శేషగిరిరవు మాట్లాడుతూ, సైట్ 3లో ఉన్న రోడ్డులో, అలాగే వైన్ షాప్ ముందు నిత్యం వాగులాగా డ్రయినేజీ పొంగి పొర్లుతుందని, చిన్నపాటి వర్షానికి స్థానికులు రోడ్డుపై నడవలేక పోతున్నారన్నారు. వెంటనే డ్రయినేజీ లీకేజీలను అరికట్టాలని సూచించారు. అలాగే అన్నా నగర్లో నివసిస్తున్న ఎస్టీ కులానికి చెందిన ఇంటికి వెంటనే నల్లా కనెక్షన్ ఇవ్వాలని మేనేజర్‌ను కోరారు. కార్యక్రమంలో సికిందర్, శ్రీను ,సోమ్లా నాయక్, అన్నా భాయ్ పాల్గొన్నారు.