Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులందరికీ ఉచిత పాసులివ్వాలి
- ఎస్ఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ డిమాండ్
- ఈసీఐఎల్ చౌరస్తా సీఎం దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
బస్పాస్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈసీఐఎల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బ్యాగరి వెంకటేష్, రాథో డ్ సంతోష్ మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీ బస్పాస్ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకో వాలని డిమాండ్ చేశారు. మార్చి ఇప్పటి వరకు మూడు సార్లు చార్జీలు పెంచడం సరికాదన్నారు. డీజిల్ సెస్ పేరుతో రూ.5, జనరల్ బస్ పాస్ చార్జీలు రూ.165- 400 5 కిలోమీటర్ల వ్యవధి దూరం గల విద్యార్థుల బస్ పాస్ చార్జీలు రూ. 115-150 వరకు, 35 కిలోమీటర్ల వ్యవధి దూరం గల విద్యార్థుల బస్ పాస్ చార్జీలు రూ.335- 550 వరకు పెంచారన్నారు. ఈ పెంచిన చార్జీలతో దాదా పు బస్పాస్ చార్జీలు గతంకన్నా రెట్టింపు అయినట్టు ఉందన్నారు. ఈ స్థాయిలో బస్పాస్ చార్జీల పెంపు చదువుకునే గ్రామీణ ప్రాంత బలహీన వర్గాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ పెంపు చర్యలను ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలనీ, లేనిపక్షంలో విద్యా ర్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళ నలు చేస్తామని హెచ్చరించారు. ఒకవైపు విద్యార్థులు కరోనా కారణంగా చదువుకు దూరం అవుతున్న సందర్భంలో మరోవైపు బస్ చార్జీల పేరిట పూర్తిస్థా యిలో విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నశించాలన్నారు. గోపురాలకు అనేక నిధులను కేటాయిస్తూ విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. అధిక భారాలు మోపుతూ ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. వెంటనే ఆర్టీసీ చార్జీలను తగ్గించి పాత చార్జీలను అమలుచేయాలనీ, విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాస్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు అజరు, నాయకులు విజయ్, ఉదరు, కిరణ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.