Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రవేశపెట్టిన అపోలో క్యాన్సర్ సెంటర్స్
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
దాతర్ క్యాన్సర్ జెనెటెక్స్ సహకారంతో రక్తపరీక్షతోనే రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించే విప్లవాత్మక టెస్టింగ్ సదుపాయాన్ని, అపోలో క్యాన్సర్ హాస్పటల్ ప్రవేశపెట్టింది. బుధవారం పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకుడు, చైర్మెన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ రొమ్ముక్యాన్సర్ గుర్తింపులో ఈజీ చెక్- బ్రెస్ట్ అనేది ఒక అతిపెద్ద సాంకేతిక పురోగతి అని తెలిపారు. క్యాన్సర్ సంరక్షణలో అపోలో క్యాన్సర్ సెంటర్స్, దాతర్ క్యాన్సర్ జెనెటెక్స్తో కలిసి భారతదేశంలోనే అత్యుత్తమ ప్రయివేట్ క్యాన్సర్ హాస్పిటల్స్‌లో మొదటి ర్యాంకును అందుకున్నదన్నారు. రొమ్ము క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుదలపై ఆంకాలజీ రంగంలో సాంకేతికత పురోగతి, వైద్య చరిత్రలోనే అత్యంత అభివద్ధికి దారితీసిందని చెపాప్పరు. అపోలో క్యాన్సర్ సెంటర్లో తమ రోగులకు అన్ని సమయాల్లో అండగా ఉంటామని, కోలుకునే మార్గంలో వారికి సున్నితమైన సంరక్షణను అందిస్తున్నామని పేర్కొనానరు. దాతర్ జెనెటిక్స్ వ్యవస్థాపకుడు, చైర్మెన్ రాజన్ దాతర్ మాట్లాడుతూ దురదష్టవశాత్తు చాలా క్యాన్సర్లు అడ్వాన్సు దశకు చేరుకున్న తర్వాత నిర్ధారణ అవుతున్నాయని, దాని వల్ల మరింత తీవ్రమైన, ఖరీదైన చికిత్సలు అవసరం అవుతాయని చెప్పారు. అందులో దుష్ప్రచారాలుతో పాటు చికిత్సా వైఫల్యం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. లక్షణం లేని వారి నుంచి కొద్ది మొత్తంలో రక్తాన్ని సేకరించి పరీక్షించడం ద్వారా, క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించవచ్చని తెలియజేశారు. అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ గ్రూపు ఆంకాలజీ అండ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ దినేష్ మాధవన్ మాట్లాడుతూ ఈజీ చెక్ - బ్రెస్ట్ తో క్యాన్సర్ మూలకణాలని గుర్తించి పరిష్కరిస్తామన్నారు. ముందుగానే నిర్వహించడం ద్వారా చికిత్సను సులభతరం చేస్తామని చెప్పారు.