Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా : చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ సాయినగర్ కమాన్ రోడ్డులో ప్రధాన అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పూడికతో నిండిపోయి చాలా రోజులైంది. పూడికతో నిండిపోవడంతో మురుగునీరు వెళ్లే దారి లేక తరచూ పొంగుతూ రోడ్లపై, ఇండ్ల ముందు మలినాలతో కంపు కొడుతూ ప్రవహిస్తుంది. పూడికను తొలగించేది తాము కాదంటే.. తాము కాదంటూ ఇటు జలమండలి, అటు ఇంజినీరింగ్ విభాగం అధికారులు బాధ్యతను గాలికి వదిలేసి వాదులాటకు దిగుతున్నారు. బాధ్యతలను మరచి చేతులు దులుపేసుకుంటున్న వైనంను చూసి చేసేది ఏమీ లేక కాలనీవాసులు కంపుకొట్టే దుర్గంధాన్ని మౌనంగా భరించక తప్పడం లేదు. ఇకనైనా ఏ మాత్రం తాత్సారం చేయకుండా సాయినగర్‌లో మురుగు పూడిక తొలగింపు విషయంలో జలమండలి ఇంజినీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్య వైఖరిపై కాప్రా సర్కిల్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు, తదితరులు కోరుతున్నారు.