Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
అల్వాల్ డివిజన్ ఓల్డ్ అల్వాల్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బస్తీ కార్యక్రమానికి మంగళవారం శంకుస్థాపన చేయగా.. డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి హాజరయ్యా రు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య మాట్లాడుతూ మన ఊరు మన బస్తీ కార్య క్రమం కింద ఎంపికైనతమ పాఠశాలకు అవస రమైన వసతుల కోసం పనులను అమలుపరిచే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ వారు 12 అంశాలని ఎంపిక చేశారు. నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు, విద్యుదీకరణ, త్రాగునీరు, ఫర్నీచర్, పెయింటింగ్, పెద్ద, చిన్న తరహా మరమ్మతులు, ఆకుపచ్చ ప్రహరీ గోడ, వంటగది, శిథిల భవనాల స్థానంలో నూతన గదులు, భోజనశాల పనులను పాఠశాల నిర్వహణ కమిటీతో చర్చించారు. వారు తయారు చేసిన అంచనా రూ.2546513 తీర్మానించారు. జిల్లా కలెక్టర్ ఈ మొత్తానికి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం 5 శాతం నిధులు ఖాతాలో జమైనందున పైన ఆరు అంశాలతో కూడిన నిర్మాణాలన్ని చేపట్టడానికి పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు కలిసి ఏకగ్రీవంగా తీర్మానించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌నగర్ ప్రధానో పాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్, కమిటీ నెంబర్లు, పిల్లల తల్లిదండ్రులు, బాలికల సెకండరీ పాఠశాల టీచర్లు అపర్ణ, లక్ష్మమ్మ, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.