Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
బోయిన్పల్లి విద్యా గణపతి ఆలయంలో ప్రతి బుధవారం బీజేపీ సీనియర్ నాయకులు టీఎన్ మురారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమాన్ని బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బానుక మల్లికార్జున్, అల్లం నరేం దర్, కేశవ రావు, మహేందర్, వర ప్రసాద్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా టీఎన్ మురారి మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు ఆలయాల వద్ద ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ అన్నప్రసాద కార్యక్రమాల వల్ల ఎంతోమంది పేద ప్రజలకు కడుపు నిండుతుందని చెప్పారు. బోయిన్పల్లి విద్యా గణపతి ఆలయంలో ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.