Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-బేగంపేట
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద 66 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను అందజేశారు. అమీర్‌పేట డివిజన్‌కు చెందిన విఠల్ దంపతులు కూడా మంత్రి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి చెక్కును అందుకు న్నారు. పేదింటి ఆడపడుచు పెండ్లికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.లక్షా 116 ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నా రు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మీ, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణి, విష్ణుసాగర్, బాలశంకర్, సత్యనారాయణ పాల్గొన్నారు.