Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అళవందార్ వేణుమాధవ్
నవతెలంగాణ-కాప్రా
ఆలిండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్, ఆలిండియా అసోసియేషన్ ఆఫ్ కోల్ ఎగ్జిక్యూటివ్స్ పిలు పు మేరకు సింగరేణి విశ్రాంత అధికారుల సంఘం, హైదరాబాద్, కోల్ పెన్షనర్ల అసోసియేషన్ హైదరాబాద్, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైదరాబాద్ ఇతర బొగ్గు పింఛనుదారుల సంక్షేమ సంస్థలు రామగుం డంలో (గోదావరిఖని లో) 26 ఆర్సీఓఏ క్లబ్లో సమావేశం నిర్వహించడానికి నిర్ణయిం చినట్టు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసో సియేషన్ ఉపాధ్యక్షులు అళవందార్ వేణు మాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 24 ఏండ్లుగా అపరిష్కతంగా ఉన్న కోల్ మైన్స్ పెన్షన్ స్కీం సమస్య పరిష్కారానికి అనుసరిం చాల్సిన కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపా రు. రామగుండం, బెల్లంపల్లి రీజియ న్లలో స్థిరపడిన సింగరేణి విశ్రాంత ఉద్యో గులు అధిక సంఖ్యలో హాజరై ఈ సమా వేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమా వేశంలో జూలై 26వ తేదీ నుంచి నెలరోజుల పాటు డిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్ట బోయే నిరసన కార్యక్రమం గురించి చర్చించి, ఆ కార్యక్రమంలో పాల్గొన బోయే విశ్రాంత ఉద్యోగుల పేర్లను నమోదు చేయనున్నట్టు తెలిపారు. ఈ సమస్య కేవలం రిటైర్డ్ ఉద్యోగు లదే కాదు కాదనీ, బొగ్గు పింఛనుదారులు, పని చేస్తున్న ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, అధికారుల సంఘం నాయకులు అందరినీ ఆహ్వానించను న్నట్ట తెలిపారు. ఈ సమావేశంలో బొగ్గు పరిశ్రమల రిటైర్డ్ ఎగ్జిక్యూటీవ్, ఎంప్లాయీస్, కార్మికుల సంఘా ల నాయకులు పి.కే.సింగ్ రాథోర్, వాసుదేవ రావు, దత్తాత్రేయులు, కేఆర్సి రెడ్డి, బాబు రావు, పీటీ స్వామి, దండం రాజు, రామచం దర్ రావు, స్థానిక కార్మిక సంఘాల నాయ కులు, అధికార సంఘం నాయకులు పాల్గొం టారని తెలిపారు. సింగరేణి రిటైర్డ్ ఎంప్లా యీస్, రిటైర్డ్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.