Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భం ఒక ప్రత్యేకమైన యోగా సెషన్‌కు సాక్ష్యంగా నిలిచింది. మహిళలు ఏడాది పొడవునా ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండేందుకు వంటగది, అందులో వాడే వంట పాత్రలతోనే సాధారణ యోగాసనాలు చేసేలా ప్రోత్సాహించడాన్ని ఈ సెషన్ హైలైట్ చేసింది. 'మెటాలికా కిచెన్ యోగా' అనే విలక్షణమైన సెషన్‌ను యోగా గురు సుజరు ప్రకాష్ ఆధ్వర్యంలో సనత్‌నగర్‌లో నిర్వహించారు. ఇందులో 65 మంది బందంతో పాటు 75 మందికి పైగా బిజినెస్ లీడర్లు, వైద్యులు, సైకాలజిస్ట్‌లు, మార్కెటింగ్ హెడ్లు, రిటైల్ చైన్ యజమానుల వంటి నిపుణులు యువత పాల్గొన్నారు. మెటాలికా ఇండిస్టీస్ సీఈఓ షర్మిలా జైన్ మేనేజింగ్ డైరక్టర్ రాజేష్ జైన్ మాట్లాడుతూ 'మెటాలికా కిచెన్ యోగా కండరాల అసమతుల్యతను సరిచేయడానికి, భంగిమను మెరుగుపరచడానికి మహిళలకు సహాయపడుతుంది. దీర్ఘకాలంలో వెన్నునొప్పి, సంబంధిత ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. భారతీయ గహాల్లో ముఖ్యమైన పాత్ర అయిన ఫ్లాట్ తవా (రోటీ తయారీకి ఐరన్ ప్లేట్) శవాసనాన్ని వర్ణిస్తుందని తెలిపారు. శవాసన కేంద్ర నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఇంట్లో ఉన్న మహిళకు తమ ఆరోగ్యం పట్ల స్పహ ఉంటే అది కుటుంబం మొత్తం ఆరోగ్యంగా మారడంలో సహాయపడుతుంది' అని వారు తెలియజేశారు.