Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
మాన్సూన్ ఎమర్జెన్సీ సిబ్బంది ప్రత్యేక వెహికిల్ ద్వారా వర్షాకాలంలో రోడ్డుపై గుంతలు పడి, నీళ్లు నిలిచిపోయే సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ తెలిపారు. బుధవారం గాంధీనగర్ ఎల్లయ్య బస్తి సమీపంలోని మాధవరావు లేన్లో చేపడుతున్న రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించారు. డివిజన్వ్యాప్తంగా ఎక్కడ రోడ్డుపై గుంతలు ఉన్నా, వర్షపు నీరు నిలిచి సమస్యలు ఏర్పడిన వెంటనే తమ దష్టికి తేవాలని ప్రజలను కోరారు. వర్షాకాలం పూర్తిగా సిబ్బంది అందుబాటులో ఉంటారని, తమకు వచ్చే ఫిర్యాదులను వెంటనే జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ వెహికిల్ ద్వారా పరిష్కరిస్తామని వివరించారు. కార్యక్రమంలో యువ నాయకులు వినరు కుమార్, అసిస్టంట్ ఇంజినీర్ తిరుపతి, వర్క్ఇన్స్పెక్టర్ మహేష్, బీజేపీ నాయకులు నవీన్ కుమార్, ప్రశాంత్ పాల్గొన్నారు.