Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
నూతన పైపులైన్ నిర్మాణం చేపట్టి పటేల్‌నగర్‌లో నెలకొన్న డ్రయినేజీ సమస్యలను పరిష్కరిస్తామని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌడ్ అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి బుధవారం పటేల్‌నగర్‌లో పర్యటించారు. స్థానికులు డ్రయినేజీ సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్‌నగర్‌లో డ్రయినేజీ సమస్య పరిష్కారానికి నూతన పైపులైన్ నిర్మాణం చేపట్టాలని అన్నారు. అందుకు పైపులైన్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు. త్వరలోనే డ్రయినేజీ పైపులైన్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు జల మండలి ఏఈ కుషాల్, నరసింహ, రాజేష్, టీఆర్ఎస్ నాయకులు ఆదిల్, వేణు, జమీల్, సంతోష్‌చారి తదితరులు పాల్గొన్నారు.