Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ జిల్లా యువజన కాంగ్రెస్ నేత పొన్నం తరుణ్ గౌడ్
నవతెలంగాణ-బోడుప్పల్
కాలనీ సంక్షేమ సంఘం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని యువజన కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా నాయకలు పొన్నం తరుణ్ గౌడ్ అన్నారు. బుధవారం బోడుప్పల్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సాయిమారుతీ నగర్ కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి అలయ అభివద్ధికి తన తండ్రి పోన్నం మురళీగౌడ్ అన్ని విధాలుగా చేయుతనిచ్చినా అలయ కమిటిలో సముచిత స్థానం కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. కాలనీ లే అవుట్ ప్రకారం పార్కు, ఆలయ నిర్మాణం కోసం సుమారు ఆరువదంల గజాల స్థలాన్ని కేటాయించి. అందులో రెండువందల గజాల స్థలంలో ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణం చేపట్టగా, మిగిలిన స్థలం అక్రమణకు గురైందన్నారు. ఈ వ్యవహారంలో స్థానిక కార్పొరేటర్ భర్తతో పాటు, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ హస్తం ఉందన్నారు. అదేవిధంగా ఆలయ బ్రహ్మోత్సవాల పేరుతో కమిటీ ప్రతినిధులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, ఆలయానికి సంబందించిన ఆదాయ, వ్యయాల వివరాలను అడిగితే చెప్పకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని తరుణ్ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ నిబంధనలకు విరుద్ధంగా ఆలయానికి సంబంధించిన విరాళాలను తన సొంత అకౌంట్లోకి సేకరిస్తున్నారని అన్నారు. కాలనీ సంక్షేమ సంఘం ముసుగులో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తాను జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తరుణ్ గౌడ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో పొన్నం రఘువీర్ గౌడ్, విశ్వం గుప్తా, కాలనీ వాసులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.