Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఉత్తమ సంస్కారం, ప్రజా హితం కోరేవారు మరణించినా సమాజం మరువదని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. అలా సమాజంలో శాశ్వత స్థానం పొందిన వారిలో పైడి లక్ష్మయ్య, సంజీవ రెడ్డి అగ్రగణ్యులని కొనియడారు. రవీంద్రభారతి ప్రధాన వేదికపై ప్రముఖ సాంస్కతిక సంస్థ రసమయి నిర్వహణలో సాహితీ ప్రియులు, ఉన్నత పెదవులు నిర్వహించిన లక్ష్మయ్య, సంజీవ రెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవం సుమధుర సంగీతభరితంగా జరిగింది. సంగీత దర్శకుడు సాలూరి కోటి, ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి, విశ్రాంత కలెక్టర్ లక్ష్మీ కాంతం, శాస్త్రవేత్త వరప్రసాద్, రచయిత ఏలూరి ఎంగన్న లకు పురస్కారం బహుకరించారు. పురస్కార గ్రహీతలు ఎంపిక సముచిత నిర్ణయ మన్నారు లక్ష్మయ్య, సంజీవ రెడ్డి లు తనకు సాహిత్య సామాజిక అనుబంధమని గుర్తు చేసుకున్నారు. అధ్యక్షత వహించిన ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ లక్ష్మయ్య సామాజిక దష్టితో శ్రీశైలం అభివద్ధి వంటి కార్యక్రమాలను అధికారిగా చేసారని సంజీవ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడుగా జన హిత అధికారి అని కొనియాడారు. స్వాగతం పలికిన డాక్టర్ రాము మాట్లాడుతూ సంస్కారవంతులను సంస్మరించుకోవటం సంప్రదాయం అని 38 ఏండ్లుగా లక్ష్మయ్య జయంతి నిర్వహిస్తున్నామని తెలిపారు. వేదికపై నరసింహాప్ప, పైడి సందీప్ పాల్గొన్నారు. ఆశాలత వ్యాఖ్యానంలో రమాచారి శిష్యులు పాడిన రాము లలిత గీతాలు ఆకట్టుకున్నాయి.