Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోడుప్పల్ నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు ద్వారా నిర్మించే నాలా ద్వారా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6 వ డివిజన్ ప్రజలకు వరద సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు పనులు ప్రారంభించామని మేయర్ సామల బుచ్చిరెడ్డి తెలిపారు. బుధవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ కుంట నుంచి పీర్జాదిగూడ మూసి వరకు ఎస్ఎన్డీపీ నిధులతో జరుగుతున్న రూ.110 కోట్ల వరద నీటి పనులను స్థానిక కార్పొరేటర్ తోటకూర అజరు యాదవ్ ఆద్వర్యంలో నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు రంగ బ్రహ్మన్న గౌడ్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బారీ వర్షాలు వచ్చి డివిజన్ లోని కాలనీలు నీట మునగ కుండా, అల్మాస్ కుంట నుంచి పనులు ప్రారంభించామని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఎన్డీపీ అధికారులు, డీఈ కుర్మయ్య, మున్సిపల్ అధికారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.