Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంగళ్‌హాట్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ లోధ్
నవతెలంగాణ-ధూల్‌పేట్
గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని బీజేపీ నేతల ఒత్తిడితో క్రీడా సముదాయం, క్రీడా మైదానాలపై జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం తగదని మంగళ్‌హాట్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ లోధ్ అన్నారు. మంగళ్‌హాట్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ నేతలు తమ పార్టీ సమావేశాలకు, బహిరంగ సభలకు క్రీడా మైదానాలు, కాంప్లెక్స్‌లను వాడుకుంటున్నారన్నారు. జీహెచ్ఎంసీ, స్పోర్ట్స్, జోనల్ కమిషనర్, స్పోర్ట్స్ అధికారుల సంబంధిత అధికారుల దష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. కానీ ఇందులో కూడా బీజేపీ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించబీపారు. క్రీడా ఆస్తులను ఆక్రమించి వారి క్రీడా విద్యార్థులను, క్రీడాకారులను ప్రత్యక్షంగా కాల్చివేస్తున్నారన్నారు. చాలా కాలం నుంచి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే తమ వాహనాల పార్కింగ్, పార్టీ సమావేశాల కోసం ఆరామ్ ఘర్ కాలనీలోని ప్లే గ్రౌండ్‌ను ఆక్రమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానాన్ని ఆటలు ఆడటానికి, కాలనీలో నడవడానికి ఉపయోగించవచ్చు కానీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. స్థానికులు చాలా కాలంగా గ్రౌండ్ కోసం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. స్పోర్ట్స్, ప్రజల సౌకర్యార్థం పని చేయాల్సిన ప్రతినిధులు ఆ సౌకర్యాలను కల్పిస్తున్నారు. అయినా మళ్లీ బీజేపీ నాయకులు తమ పార్టీ సమావేశాలు, అధికారుల కోసం హిందీ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను స్వాధీనం చేసుకున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం భారీ మొత్తంలో మంజూరైన నిధులతో నూతనంగా క్రీడా ప్రాంగణాన్ని నిర్మించిందన్నారు. కానీ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, ఇన్‌చార్జ్‌లు, నాయకులందరూ ప్రభుత్వ ఆస్తులను వారు ఉపయోగించుకోవడాన్ని ఖండించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ యువకులను దెబ్బతీస్తున్న ఎవరూ పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాజకీయ ఆటపాటలకు, ఫంక్షన్లకు మైదానాలను వాడుతుండగా సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల యువత భవిష్యత్తు కోసం క్రీడలను ప్రోత్సహించాలని కోరారు.