Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్
- అక్రిడేషన్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలకు ఆమోదం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందజేస్తామని అక్రిడేషన్ కమిటీ చైర్మెన్, జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. గురువారం జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశం జరిగింది. అర్హులైన వారందరికీ కార్డులు ఇవ్వాలని తీర్మానించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా 851 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి కార్డులను జారీ చేయాలని కమిటీ ఆమోదించింది. జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి (డీపీఆర్వో) కిరణ్ కుమార్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు వి.రామారావు, కె. వెంకటేశ్వర్లు, మెరుగు చంద్రమోహన్, ఎం.వెంకట్ రెడ్డి, సముద్రాల కిరణ్, బొమ్మ సురేందర్, జి.ముత్తయ్యగౌడ్, కె.సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.