Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి
నవతెలంగాన-తుర్కయంజాల్
తుర్కయంజాల్ మున్సిపాలిటీ స్వచ్ఛత కోసం వ్యాపారస్తులందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ ఆర్ జ్యోతి పేర్కొన్నారు. మున్సిపాలిటిలో వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్న విక్రయదారులతో మున్సిపల్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వ్యాపారస్తులు ప్లాస్టిక్ వినియోగించవద్దని, మాంస వ్యర్థాలను పురపాలక స్వచ్ఛ ఆటోలో వేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకూడదని సూచించారు. హౌటల్స్, రెస్టారెంట్స్, బేకరీలలో పరిశుభ్రమైన ఆహారపదార్థాలను విక్రయించాలని కోరారు. కుళ్లిన ఆహారపదార్థాలను విక్రయిస్తే గనుక పురపాలక చట్టం 2019 ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ఫుడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ప్రతీఒక్క వ్యాపారి అందుబాటులో ఉంచుకొని, తనిఖీ నిర్వహించే పురపాలక సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాసులు, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, పర్యావరణ ఇంజనీర్ హరీశ్, కార్యాలయ సిబ్బంది చంద్రశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, పారిశుధ్య జవాన్లు తదితరులు పాల్గొన్నారు.