Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి
నవతెలంగాణ-బోడుప్పల్
పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ. యాదగిరి తెలిపారు. ఆర్టీసీ చెంగిచెర్ల డిపోను గురువారం ఆయన తనిఖీ చేశారు. డిపో పరిసరాలు, మెయింటెనెన్స్, గ్యారేజ్, స్టోర్, టైర్ సెక్షన్, ట్రాఫిక్ సెక్షన్లను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇటీవల ప్రారంభమైన కళాశాల, పాఠశాలల విద్యార్థుల విషయంలో రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలన్నారు. నగర శివారు ప్రాంతాలలో అనేక కాలనీలు వెలసినందున ప్రయాణికుల అవసరాలను గుర్తించి, బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సరైన రవాణా సౌకరం సక్రమంగా అందేలా సూపర్ వైజర్లు కృషి చేయాలన్నారు. సంస్థ ఆదాయాన్ని మరింత పెంచేందుకు ఉద్యోగులు కష్టపడి పనిచేయాలన్నారు. ప్రయాణికులే సంస్థకు మార్గదర్శకులని, వారిపట్ల నిర్లక్ష్యం వహించకుండా సేవలు అందించాలని చెఆప్పరు. వర్షాకాలం సందర్భంగా డ్రైవరు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలన్నారు. ఆర్టీసీ బాగుంటేనే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించగలుగుతామని, అందుకే ప్రతి ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కోరారు. చెంగిచెర్ల డిపో పరిసరాలలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ సందర్భంగా డిపో ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎన్ ఈసు, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) సుబ్రహ్మణ్యం, సూపరిండెంట్ వేణుగోపాల్ రావు, ఉద్యోగులు. తదితరులు పాల్గొన్నారు.