Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో గౌతంనగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న ప్రతి సమస్యనూ గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని దయానంద్ నగర్లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈమధ్య నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రధానంగా శానిటేషన్, డ్రయినేజీ, రోడ్లు, తాగునీటి వ్యవస్థపై ప్రజల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని, వాటికి శాశ్వత పరిష్కారం లభించేలా తగిన ప్రణాళికలు రూపొందించి శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ లౌక్య, వర్క్ ఇన్స్ పెక్టర్ వెంకటేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాము యాదవ్, స్థానిక కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.