Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికోసం నిరంతరం కృషి చేస్తున్నామని మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. గురువారం కార్పొరేషన్ పరిధి, 18వ డివిజన్లోని హయత్ కౌంటీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు మేయర్ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధుల, అధికారుల సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రభాగాన నిలపెట్టడానికి తమ వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సహకారంతో ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, డీఈఈ జ్యోతి, కార్పొరేటర్లు బండారి మనోహర్, నేనావత్ బాలు నాయక్, బొర్ర జగన్ రెడ్డి, జెనిగే శ్రీనివాస్ యాదవ్, బొర్ర మాధవ్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.