Authorization
Mon March 17, 2025 10:46:02 pm
నవతెలంగాణ-కూకట్ పల్లి
కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని బాలకృష్ణ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలవడంతో అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాతో సత్కరించిన కార్పొరేటర్ జూపల్లి సత్యనా రాయణ. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలఈన, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరి స్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.