Authorization
Sun March 16, 2025 08:42:13 am
- రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయమని మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజరు నగర్ కాలనీలో సీసీ రోడ్లు వేయించాలని స్థానిక కార్పొరేటర్ బి. విజరు శేఖర్ గౌడ్ మంగళవారం ఎమ్మెల్సీ శంబీపూర్రాజును మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగరాజు యాదవ్, కౌన్సిలర్లు శంభీపూర్ కష్ణ, అర్కల అనంతస్వామి, నాయకులు జెమ్మి దేవేందర్, భాస్కర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.