Authorization
Fri March 21, 2025 07:55:13 pm
నవతెలంగాణ-ఓయూ
నిజాం కళాశాల డిగ్రీ ఫస్టియర్ (తెలుగు విభాగం) విద్యార్థి కె. రాహుల్ మంగళవారం ఉదయం పాముకాటుకు గురయ్యారు. రాహుల్ ఓయూలోని ఈ2 వసతిగృహంలో 91 రూమ్, ట్రాన్స్ఫార్మర్ వద్ద గల రహదారిపై మలవిసర్జన చేస్తుండగా పాము కాటేసింది. దీంతో అతని మిత్రులు రాహుల్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణ ప్రాయం లేదని డాక్టర్స్ చెప్పడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.