Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
కస్తూర్బా పాఠశాలల్లో తొలగించిన 937 మంది టీచర్లను కొనసాగించాలనీ, తాత్కాలిక పోస్టుల్లో తిరిగి తాత్కాలిక నియామకం చేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మెన్ నీల వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కస్తూర్బా టీచర్లుతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది అక్టోబర్ మాసంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవో 1321 కస్తూ ర్బా గాంధీ పాఠశాలల్లో 937 టీచర్ పోస్టులను మెరిట్ ఆధారంగా సీఆర్టీ, పిజిసిఆర్టిలుగా భర్తీ చేశారని గుర్తు చేశారు. వారిని నవంబర్ 1వ తేదీ నుంచి విధుల్లోకి తీసుకున్నారన్నారు. 23 ఏప్రిల్ 2022 వరకు పని చేయించుకుని అకస్మాత్తుగా టర్మినేట్ చేశారని గుర్తు చేశారు. తిరిగి నేడు 1,000 పోస్టులు కొత్త వారితో భర్తీ చేయడానికి ప్రభుత్వం నుంచి జిల్లా స్థాయి అధికారులకు కొత్త ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఉన్న 937 మంది టీచర్లు మెరిట్ పై సెలక్ట్ చేసి నియమించి కెజిబివిలలో బోధకులు సిఆర్టీ, పీజీసిఆర్టీలుగా పని చేస్తున్నారని గుర్తు చేశారు. తిరిగి వారి పోస్టుల స్థానంలో కొత్త వారిని భర్తీ చేస్తున్నట్లు జిల్లా అధికారులు అంటున్నారన్నారని తెలిపారు. పని చేస్తున్న తాత్కాలిక పోస్టుల్లో మళ్లీ తాత్కాలిక ఉద్యోగులను నియమించవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. గత నవంబర్ నుంచి పని చేస్తున్న 937 మంది టీచర్ల ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోస్టుల్లో కొత్త వారిని నియమించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. పాత వారినే కొనసాగించాలని కోరారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సానుకూ లంగా స్పందించి కస్తూర్బా టీచర్లను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరు ద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకులు వేముల రామకృష్ణ, కస్తూర్బా టీచర్లు ఊర్మిళ, శిరీష, అనురాధ, సురేఖ, లక్ష్మి పాల్గొన్నారు.