Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధానికి రాష్ట్రాన్ని సందర్శించే హక్కు లేదు
- ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బోస్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
క్రూరమైన ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడు తున్న హిట్లర్ ఆరాధకుడు ఫాసిస్ట్ ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణను సందర్శించే హక్కు లేదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక, ప్రజా వ్యతిరేక విధా నాలకు పాల్పడుతున్న ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ శనివారం హిమాయత్‌నగర్‌లో ప్రదర్శన నిర్వహి ంచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలం గాణలోని ప్రజల ఆస్తులైన ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, సింగరేణి 4 బొగ్గు గనుల అమ్మకాలకు పెట్టి, స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ నిర్వీర్యం చేసి, తెలంగాణ ప్రజల ఆకాంక్షాలైన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, పసుపు బోర్డు వంటి సంస్థలు స్థాపించకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న మోడీ హైదరాబాద్‌కు రావ డం సిగ్గు చేటన్నారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం, అసమానతలు అంతులేని స్థాయిలో పెరుగుతున్నా అవన్నీ పట్టించుకోకుండా, దేశ సంపదలైన ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ బ్యాంకులను తెగనమ్ము కుంటూ వ్యవస్థీకృత దోపిడీకి ప్రధాని పాల్పడుతు న్నాడన్నారు. ఇదే కాకుండా కార్పొరేట్లు చేసే దోపిడీని చట్టబద్ధం చేశారని మండిపడ్డారు. జాతీయ బ్యాంకుల ను నిండా ముంచుతున్న బడా పారిశ్రామికవేత్తలకు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా బోర్డులో సభ్యులుగా ఎలా నియమిస్తారనీ, అంటే ఆర్బీఐను కూడా వారు దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చారా అని ప్రశ్నించారు. వెంటనే వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ లాభాల్లో ఉన్న ఎల్ఐ సిని లిస్టింగ్ లో పెట్టి అతిపెద్ద సంపద విధ్వంసక సంస్థగా మార్చివేసిందనీ, ఎల్ఐసి షేర్లు పాతాళానికి పడిపోవడం వాస్తవం కదా అనీ, ప్రజలు ఆందోనళ చెందుతున్న విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. కార్మికుల కోసం కేటాయించిన మొత్తం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా మార్చ డం వల్ల సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులం దరికీ తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ప్రస్తుతం సంస్థల్లో 8 పని గంటలు ఉండగా కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే, అవి 12 గంటల వరకు పెరిగే అవ కాశం ఉందనీ, వేతనాలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నా యనీ, దీని వల్ల ఉద్యోగి ఆరోగ్య, కుటుంబ జీవితంపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాలు, కార్పొరేట్ల ఆదాయం పెంచు కోవడం కోసమే తీసుకువచ్చిన ఈ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలనీ, స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్‌ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో ఏఐటీయూసీ హైద రాబాద్ జిల్లా అధ్యక్షులు కమతం యాదగిరి, ప్రధాన కార్యదర్శి నరసింహ, కోశాధికారి కిషన్, కార్యదర్శులు మల్లేష్, లక్ష్మీ, నాయకులు సబ్బు రాజమౌళి, రమేష్, ఉమర్ ఖాన్, జంగయ్య, జ్యోతి శ్రీమాన్ పాల్గొన్నారు.