Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీజులు నియంత్రణ చట్టం తీసుకురావాలి
- పభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
- బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య
నవతెలంగాణ-హైదరాబాద్
విద్యా వ్యాపారాన్ని అరికట్టేందుకు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలనీ, విద్యావ్యాపారాన్ని అరికట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య డిమాండ్ చేసింది. బీడీఎస్ఎఫ్ సిటీ (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల) ఇన్చార్జి ఎంపీ స్టాలిన్ మాట్లాడుతూ రాష్ట్రం విద్యా వ్యాపారానికి కేంద్రంగా మారిందన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థ లను కేవలం లాభాపేక్షతోనే నడుపుతున్నారని తెలిపారు. ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యాంగ ఫీజులు పెంచి, విద్యార్థి తల్లిదండ్రులను పీడిస్తున్నాయనీ, ఈ దందాను అరికట్టి విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. అడ్మిషన్ల టైంలో తక్కువ ఫీజులు తీసుకుంటామని చెప్పి అడ్మిషన్ అయిన తర్వాత అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రైమరీ విద్యార్థులకు రూ.25 వేలు వసూలు చేస్తూ, వ్యాస్ ఫీజు, బుక్స్, డ్రెస్సు, టై, బెల్టు, పేరుతో మరో రూ.25 వేలు వసూలు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించు కోవడం లేదన్నారు. పేద విద్యార్థుల తల్లిదండ్రుల సంపాదన, వారి ఫీజులకు కూడా చాలడం లేదనీ, పై తరగతులకు వెళ్లే కొద్దీ మరింత ఫీజుల భారం పెంచుతున్నారని తెలిపారు. పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ అడ్డగో లుగా ప్రయివేటు పాఠశాలలకు అనుమతి ఇచ్చి పేదలకు విద్యను దూరం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. పేదలకు అందుబాటులో ఉండాల్సిన విద్య, కార్పొరేట్ వ్యా పారం అయిందనీ, ప్రభుత్వం కనుసన్నలోనే ఈ విద్యావ్యా పారం నడుస్తోందన్నారు. రాష్ట్రంలో కేవలం పాఠశాలలు ప్రారంభమైన మూడు నెలల్లో (జూన్, జులై, ఆగస్టు) విద్యా సంస్థలు దాదాపు రూ.25 వేల కోట్ల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిటీ కమిటీ సభ్యులు శ్రీకాంత్, శివ ప్రసాద్, శేఖర్, నవీన్, భాస్కర్, దయానంద్, తదితరులు పాల్గొన్నారు.