Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్లో ఒక ఉద్యోగితో ప్రారంభమైన ఎంఎస్ఆర్ కాస్మోస్ గ్రూప్ ఇప్పుడు ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ డొమైన్లో ప్రసిద్ధి గాంచింది. ఎంఎస్ఆర్ కాస్మోస్ గ్రూప్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఫార్చ్యూన్ 500 క్లయింట్లకు సాంకేతిక పరిష్కారాలను అందిస్తూ వేగంగా అభివృద్ధి చెందుతున్న బహుళజాతి ఐటీ సేవల సంస్థగా రికార్డు సాధించింది. ఈ గ్రూప్ ఇప్పటికే ఉన్న తన వ్యాపా రంతో తన పరిధిని విస్తతం చేసుకోవాలని భావిస్తోంది. చిన్న బీ2బీ వ్యాపారాలు తక్కువ లేదా పెట్టుబడి లేకుండా ఎక్కువ మంది వినియోగదారులను చేరుకోవడానికి సహా యపడే కొత్త ఆఫర్ను భారతీయ మార్కెట్కు పరిచయం చేయడానికి కూడా ఆసక్తిగా ఉంది. ఈ సందర్భంగా ఎమ్ఎస్ఆర్ కాస్మోస్ వ్యవస్థాపకుడు శివ గోపాల్ మాట్లా డుతూ ''ఎంఎస్ఆర్ కాస్మోస్ గ్రూప్ కోఫౌండర్, సీఈఓ, నా భార్య దేవి కొండపి సహకారంతో ఇంత పెద్ద సంస్థను ప్రారంభించాం. ఆమె మద్దతు, ప్రోత్సాహం అనుక్షణం వ్యూహాలపై దృష్టి సారిస్తూనే సంస్థ నిర్వహణలో ఆమె తన అత్యుత్తమ ప్రదర్శనను అందిస్తోంది. ఈ గ్రూప్ ప్రస్తుతం ఉన్న వ్యాపారంతో దాని పరిధిని విస్త్రృతం చేయడంతో పాటు బీ2బీ వ్యాపారాలు తక్కువ లేదా పెట్టుబడి లేకుండా ఎక్కువ మంది వినియోగదారులకు చేరువయ్యేలా సహా యపడే కొత్త ఆఫర్ను భారతీయ మార్కెట్కు పరిచయం చేయాలని కూడా యోచిస్తోంది'' అని తెలి పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సీఎఫ్ఓ శరత్, సీఓఓ వేదవ్యాస్, ఏపీఏసీ హెడ్ ప్రదీప్ కుమార్, ప్రొడక్ట్స్ డైరెక్టర్ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.