Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ప్రతి విద్యార్థి కృషి పట్టుదలతో చదువుకొని ఉన్నత లక్ష్యం కోసం కృషి చేయాలని కొర్రెముల సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ మం డలం కొర్రెముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి పదవ తరగతి పరీక్షలో 9.8 జిపిఎ సాధించి మండల టాపర్గా నిలిచిన తను శ్రీ అనే విద్యార్థిని శనివారం స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ ముఖ్య అతిధిగా పాల్గొని శాలువాతో సత్కరించి, భారత రాజ్యాంగం, అంబేద్కర్ దినచర్య పుస్తకాలను బహుకరిం చడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు కషి, పట్టుదలతో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధ్దగా విని, ఏ రోజు వర్క్ ఆ రోజే చేసుకోవాలని సూచించారు. పాఠశాలదశ నుండే ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకొని వాటి సాధనకు కషి చేయాలని అన్నారు. అంతకుముందు స్ఫూర్తి ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంటోళ్ల యాదయ్య మాట్లాడుతూ తనుశ్రీని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. విద్యార్థులు నేను చదువుతానో లేదో అనే సందేహాలు వీడి నేను మండల, జిల్లా స్థాయిలో టాపర్గా నిలవాలని దఢ నిశ్చయంతో ముందుకు సాగినపుడే మంచి ఫలితాలు పొందగలుగుతామని పేర్కొన్నారు. అన్ని గ్రంథాల కన్న భారత రాజ్యాంగం గొప్పదని, ప్రతి విద్యార్థి భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కందుల రాజు ముదిరాజ్, వార్డు సభ్యులు ఎరుకల దుర్గరాజ్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, నాయకులు ఉడుగుల సత్యనారాయణ, మాటూరి రవి, ఆర్గనైజేషన్ సభ్యులు లంబరాజు యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.