Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దేశంలో నెలకొని ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకే అగ్నిపథ్‌ను తీసుకువచ్చారనీ, అగ్ని పథ్ ను వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం హిమాయత్‌నగర్ ''వై'' జంక్షన్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు అశోక్ స్టాలిన్, కార్యదర్శి రావి శివ రామకృష్ణ మాట్లా డుతూ ప్రధానమంత్రి మోడీ విధానాలు నిరుద్యోగ యువతను పెంచి పోషించేలా ఉన్నాయన్నారు. దేశ సేవ చేసే ఆర్మీ ఉద్యోగాలు ఏమైనా తాత్కాలిక ఉపాధి కేంద్రాల అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అగ్నిపథ్ వల్ల యువత నిరుత్సాహంతో ఆందోళనలు చేస్తుంటే బీజేపీ హైదరాబాద్‌లో కేంద్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం దానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రావడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ఉద్యోగమంటే జీవితానికి అన్ని విధాలుగా భద్రత ఉండాలనీ, ఉద్యోగం చేస్తున్న ఏ రంగంలోనైనా రిటైర్ అయ్యే కాలం వరకు పని ఉండాలి కానీ, మోడీ ప్రభుత్వం ఇటీవలే ఆర్మీ రిక్రూట్మెంట్కు పాత పద్ధతిని వదిలేసి, కొత్తగా అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను తీసుకొచ్చిందనీ, ఈ పద్ధతి ప్రకారం ఉద్యోగం పొందిన అభ్యర్థులు కేవలం నాలుగేండ్లకే ఉద్యోగం చేసే అవకాశం ఉందనీ, నిరుద్యోగులను మోసం చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం టూర్ ఆఫ్ డ్యూటీ అనే అందమైన అబద్ధం చెప్తుందన్నారు. 2021లో ఆర్మీ ర్యాలీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇంత వరకు రాత పరీక్షలు నిర్వహించకపోవడం సిగ్గు చేటన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్ల కు పాలకవర్గాల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఆయా అల్లర్లలో మరణించిన దామేర రాకేష్ కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గాయపడిన వారిని ప్రభుత్వాలు ఆదుకో వాల్సింది పోయి అక్రమ కేసులు నమోదు చేస్తున్నా యన్నారు. ఇప్పటికైనా కేంద్రం తమ రాజకీయ కుట్రలు మానుకొని చిత్తశుద్ధితో అగ్నిపథ్ ను రద్దు చేసి పాత పద్దతిలో ఆర్మీ నియామకాలు కొనసాగిం చాలనీ ,దేశ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనై జింగ్ సెక్రెటరీ ఆర్ఎన్.శంకర్, ఆఫీస్ బేరర్స్ డి.రా ము, బొనగిరి మహేందర్, పుట్ట లక్ష్మణ్, నాయకులు ఇటికాల రామకృష్ణ, బరిగల వెంకటేష్, మర్రి శ్రీమాన్, గ్యార క్రాంతి, మణికంఠరెడ్డి, రఘురాం, పార్థసారథి, లెనిన్, ఫహిం దాదా, సి.రాజు, మురళీకృష్ణ, సన్నీగౌడ్, బి.సంతోష్, ప్రేమ్ కుమార్, హరిష్ గౌడ్, పి.శివ పాల్గొన్నారు.