Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా హైదరాబా దుకు వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం పలికేం దుకు ఎమ్యెల్యే మైనంపల్లి హనుమంతరావు నేతృ త్వంలో భారీ ద్విచక్ర వాహనాలపై బయలుదేరి వెళ్లిన మల్కాజిగిరి నియోజకవర్గం కార్పొరేటర్లు, అధ్యక్షులు, కార్యకర్తలు. ముత్యాలమ్మ టెంపుల్ బొల్లా రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్ జితేంద్రనాథ్, సబిత అనిల్ కిషోర్, ప్రేమ్ కుమార్, అనిల్ కిషోర్ గౌడ్, బీఎన్ రమేష్, కొండల్ రెడ్డి, గుండా నిరంజన్, బబితా, గాయత్రి, బలవంత రెడ్డి, పుట్నాలకృష్ణ, శ్రీశైలం యాదవ్, మల్లెల శివ, మోసిన్ పాల్గొన్నారు.
కంటోన్మెంట్ : రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఆహ్వానం పలిచేందుకు టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వ ర్యంలో మల్లారెడ్డి గార్డెన్ నుంచి ర్యాలీగా బయలు దేరారు. వందల మంది యువకులు బైకులపై జెండాలపై పట్టుకుని నినాదాలు చేస్తూ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం బలం రాయి చౌరస్తాలో ఎమ్మెల్యే సాయన్నతో కలిసి టీఆర్ఎస్ శ్రేణులు బేగంపేట్‌కి తరలి వెళ్లారు
కాప్రా : విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా మద్దతు కోరుతూ హైదరా బాద్ నగరానికి వచ్చిన తరుణంలో కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్, ఉప్పల్, చర్లపల్లి పార్టీ శ్రేణులతో కలిసి 100 బైకులతో పెద్ద ఎత్తున స్వాగతం పలికేం దుకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు ర్యాలీగా బయలు దేరి వెళ్లి, జల విహార్ మద్దతు సభకు హాజరయ్యారు.
కాప్రా : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్ధతుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన జలవిహార్‌లో సభను నిర్వహించిన సందర్బంగా మల్లాపూర్ డివిజ న్ నుంచి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహి ంచారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నోమా ఎలిఫెంట్ చౌరస్తా నుంచి శివ హౌటల్, నాచారం, హబ్సి గూడ మీదుగా బేగంపేట్ చేరుకున్న మల్లాపూర్ తెరాస శ్రేణులు యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలి కారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పల్లా కిరణ్ కుమార్ రెడ్డి, తాండ వాసుదేవ్ గౌడ్, మహిళా నాయకులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటనకు వస్తున్న సందర్భంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాలతో శనివారం మల్కాజిగిరి సర్కిల్ గౌతమ్ నగర్ డివిజన్ తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో సాయి నగర్ లోని కార్పొ రేటర్ కార్యాలయం నుంచి అల్వాల్‌లోని ముత్యా లమ్మ టెంపుల్ వరకు బైక్ ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే మైనంపల్లితో బైక్ ర్యాలీలో పాల్గొని ఎయిర్ పోర్ట్ వరకు వెళ్లి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కాప్రా : ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఆదేశాల మేరకు మీర్‌పేట హెచ్‌బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ జెరిపో తుల ప్రభుదాస్, డివిజన్ అధ్యక్షులు గుండారపు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వ ంత్ సిన్హాకి మద్దతుగా డివిజన్ నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, బొంతు శ్రీదేవి, స్వర్ణరాజ్, సైజెన్ శాంతి శేఖర్, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
ఓయూ : నగరానికి చేరుకున్న రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కు స్వాగతం పలికేందుకు డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ నేతృత్వంలో బేగంపేట్ విమానాశ్రయం వరకు భారీ బైక్ ర్యాలీతో వెళ్లారు. బౌద్దనగర్, సితాఫలమండి, మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్టల నుంచి వందలాది మోటార్ బైక్‌లపై ర్యాలీగా బేగంపేట్ విమానాశ్రయం వద్దకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, పద్మారావు గౌడ్, టీఆర్ఎస్ యువ నాయకులు కిషోర్ కుమార్, తీగుల్ల రామేశ్వర్ గౌడ్, వివిధ డివిజన్ల నాయకులు ఉన్నారు.
డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో.
తార్నాక డివిజన్ పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్న సందర్బంగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, తర్నాక డివిజన్ టీఆర్ఎస్ నాయ కులతో కలిసి బైక్ ర్యాలీతో బయల్దేరి వెళ్లారు.
సుల్తాన్‌బజార్ : రాష్ట్రపతి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు బేగంపేట విమానాశ్రయంకు ర్యాలీగా తరలి గోశామహల్ నియోజకవర్గ నాయకుడు ఎం.ఆనంద్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్చార్జి ప్రేమ్ సింగ్ రాథోడ్, సంతోష్ గుప్తా, మహిళా నాయకురాలు ప్రియ గుప్త, జాంబాగ్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నందు కుమార్, దుర్గక్క, మాధవి, రాజు భారు, సజీద్ భారు, గౌస్ భారు, ఖైసర్ భారు, విజరు కుమార్, లక్ష్మన్ ఉన్నారు.
సుల్తాన్ బజార్ : రాష్ట్రపతి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు ఘనంగా స్వాగతం పలికేందుకు తరలిన ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, నాంపల్లి నియోజ కవర్గ ఇన్చార్జి ఆనంద్ కుమార్, మురళీధర్, అబ్దుల్ కలీం, జాకీర్ ఉల్లా ఖాన్, అభిషేక్, రాజ్ లక్ష్మీనారాయణ, తదితరులు.
సుల్తాన్ బజార్ : రాష్ట్రపతి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు స్వాగతం పలికేందుకు తరలిన ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, టీఆర్ఎస్ నాయకులు సంతోష్ గుప్తా, జగదీష్ బంజారా హిల్స్ : రాష్ట్రపతి పదవి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశానుసారం నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజ యలక్ష్మి, కార్పొరేటర్లు కవిత రెడ్డి, సంగీత యాదవ్, వెల్దండ వెంకటేష్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ధూల్ పేట్ : రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి నగరానికి వస్తున్న సందర్భంగా కార్వాన్ గుడిమల్కాపూర్ నుంచి నియోజకవర్గ ఇన్చార్జి జీవన్ సింగ్ ఠాగూర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలో నిర్వహించారు. ర్యాలీతో డివిజన్ అధ్యక్షులు సి బాబు, ఆదిత్య యాదవ్, చంద్రకాంత్, జబ్బార్ కార్వాన్ సీనియర్ నాయకులు శ్రీధర్ సాగర్ బాలరాజు బేగంపేట్ జలవిహార్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
అంబర్‌పేట : విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గం టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరళి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరు కుమార్‌గౌడ్ టీఆర్ఎస్ నాయకులు సిద్ధార్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.