Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ సినిమా దర్శకులు శేఖర్ కమ్ముల
నవతెలంగాణ-అడిక్‌మెట్
పిల్లలు బాగా చదువుకొని, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ప్రముఖ సినిమా దర్శకులు శేఖర్ కమ్ముల అన్నారు. మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న బాలబాలికలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక జన్మదిన వేడుకలు నిర్వహించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల హాజరై చిన్నారులకు ఆటవస్తువులు, బహుమతులు అందజేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువే పిల్లల భవిష్యత్‌ను నిర్ణయిస్తుందన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ వై. సంజీవకుమార్ను అభినందించారు. కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఓ. పావని, సభ్యులు హైందవి, హర్ష, జతిన్, అఖిల్, ధీరజ్, సాయికిరణ్, రవిగౌడ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.