Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జూపాక శ్రీనివాస్, పి మహేష్
నవతెలంగాణ-అడిక్‌మెట్
విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ తీవ్రతరమై పేద విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తుంది అని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జూపాక శ్రీనివాస్ పి మహేష్ అన్నారు. మంగళవారం విద్యానగర్‌లోని మార్క్స్ భవన్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పీడీఎస్‌యూ సమరశీల పోరాటాలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వాల అవలంభిస్తున్న విధానాల వల్ల నేడు విద్యా ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ తీవ్రతరమై పేద విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తుందని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వం విద్యారంగంలో అశాస్త్రీయ భావజాలన్ని నింపి మూఢనమ్మకాలు పెంపొందించే విధంగా సిలబస్‌ను తయారు చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యారంగ వ్యతిరేక విధానాలకు, వ్యతిరేకంగా ఉద్యమించడం కోసం, విద్యార్థులను పోరాటాలకు సంసిద్ధం చేయడం కోసం ఈనెల 27 26న సూర్యాపేట ఐఎంఏ ట్రస్ట్ హాల్లో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ తరగతుల్లో ప్రొఫెసర్లు, ప్రజా ఉద్యమ నాయకులు క్లాసులు బోధిస్తారని అన్నారు. రాజకీయ శిక్షణ తరగతులకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ శ్రీకాంత్, శ్రీకాంత్, గడ్డం శ్యామ్, పోలబోయిన కిరణ్, రాష్ట్ర నాయకులు చందర్రావు, నాయకులు గౌతమ్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.