Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఛందోబద్ధమైన పద్య కవితా విద్యా భూషణుడు నండూరి రామకృష్ణమాచార్య అని, ఆయన రాసిన ప్రతి పదం అలంకరబద్ధమై వెలుగులీనుతుందని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ కొనియాడారు. తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరంలో నవ్య సాహిత్య సమితి, నండూరి రామకష్ణమాచార్య సాహితీ పీఠం సంయుక్తంగా రామకష్ణ మాచర్య శత జయంతి రెండు రోజుల ఉత్సవం ప్రారంభ సభకు డాక్టర్ రమణ పాల్గొని మాట్లాడారు. రామకృష్ణ ఆచార్యులు సంస్కతాంధ్ర, ఆంగ్ల భాషా కోవిదులన్నారు. ఆధునిక సమాజ పోకడలను సులభ పదాలతో పద్య కవిత్వం మాధ్యమంగా చెప్పిన భాషా చతురులు అని వివరించారు. మార్క్సిజం భావజాలన్ని ఎంతమంది చెమట, ఎంతమంది రక్తం పీల్చకుండా, ఎవరు పేర్చే ధనం, దొరలు చేయునట్టి దోపిడియే ఆస్తి, అంతరించవలయు ఆస్తి హక్కు అని ఆధునికతను పద్య స్ఫోరకంగా చెప్పారని పేర్కొన్నారు. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎస్వీ రామారావు అధ్యక్షత వశించిన సభలో సాధన నరసింహాచార్యా, నారుమంచి వెంకట కృష్ణ పాల్గొనగా వేమరాజు విజయ కుమార్ స్వాగతం పలికారు. ఆచార్య ఫనీంద్ర నండూరి ఖండకావ్యాలు, దత్తాత్రేయ శర్మ ముక్తక పద్యాలు, డాక్టర్ నిత్యానంద రావు విమర్శ లక్షణ గ్రంథాలు అంశాలపై ప్రసంగాలు చేశారు.