Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కేంద్రం వాటా కింద ఏడో పీఆర్సీ యూజీసీ ఏరియర్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఓయూ ఔటా ప్రతినిధులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు. రిక్రూట్మెంట్ బోర్డు యూజీసీ నిబంధనలకు విరుద్ధమని, దీనిపై తాము ప్రతిస్పందిస్తామని తమతో చెప్పినట్లు ఔటా ప్రతినిధులు చెప్పారు. కార్యక్రమంలో ఔటా అధ్యక్షులు మనోహర్, ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ కష్ణయ్య తో పాటు 20 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.