Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పేద విద్యార్థులకు చేయూత అందించడం కోసం దాతలు .స్వచ్ఛంద సంస్థలు .ముందుకు రావడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేప. వివేకానంద్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో గాంధీనగర్ ఐలా అధ్యక్షులు, పవర్ టెక్ ట్రాన్స్ఫాÛర్మర్ ఎండీ పి .స్వామి గౌడ్, గ్రీన్ ఆక్వా ఎండీ విజరు బాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదువుతూ మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట రాములు, గాంధీనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జల్దా రాఘవులు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఏర్వ సీనియర్ నాయకులు మేకల ఎల్లయ్య, అబ్దుల్ ఖాదర్, పారిశ్రామికవేత్తలు రవీందర్రావు, హరినాథ్ గౌడ్, సురేష్ గౌడ్, శ్రీనివాస్, సత్యనారాయణ, రహీమ్, రవీందర్, తిమ్మయ్య, వెంకట సాయి, నవీన్, నాగరాజ్, దత్తు, సతీష్, కార్తిక్ గౌడ్, అల్లావుద్దీన్, సందీప్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరాలు ఉపయోగించుకోవాలి
సేవా దక్పథంతో ప్రయివేట్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి నగర్ డివిజన్ వెంకటరామిరెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్లో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక తులిప్స్ హాస్పిటల్ నేతత్వంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రముఖ వైద్య నిపుణులు ఎస్ .డాక్టర్ అర్పితా సుమారు 250 కు పైగా మంది పరీక్షలు చేశారు. అనంతరం తులిప్స్ హాస్పిటల్ సిబ్బంది ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తులిప్స్ హాస్పిటల్ డైరెక్టర్ .సి .సంజరు బాబు, సిబ్బంది జోత్స్నారాణి, జ్యోతి, మహేష్, సుమన్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, సంక్షేమ సంఘం అధ్యక్షులు సతీష్ గట్టోజి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మెన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, వార్డు కమిటీ సభ్యులు ఎన్. లక్ష్మణ్ గౌడ్, అబ్దుల్ ఖాదర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జల్దా రాఘవులు, జల్దా లక్ష్మీనాథ్ పాల్గొన్నారు.