Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రభుత్వ సిటీ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో రాణించారు. ఒడిశా రాజధాని కటక్‌లో జరిగిన జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ఇద్దరు విద్యార్థులు పతకాలు సాధించి తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.బాల భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకోవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. విద్యార్థులు కేవలం చదువులే కాకుండా మానసికోల్లాసం కోసం, శారీరకదఢత్వం కోసం క్రీడల్లో కషిచేసి విశేషంగా రాణించాలన్నారు. బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న పి.వంశీ, కుమారి బేబీ రెడ్డిలు జూనియర్ నేషనల్ ఫెన్సింగ్ పోటీలలో బాలురు, బాలికల విభాగంలో బంగారు, రజత పతకాలు సాధించి, జాతీయస్థాయిలో కళాశాల పేరును నిలిపారని వారిని అభినందించారు. వారు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించటానికి ఆయా తరగతి అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్ అవసరమైన సహకారం అందిస్తారని తెలియజేశారు. ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఆటల్లో కషిచేస్తే విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటమే కాక, విద్యను ఏకాగ్రతతో అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకుంటారని అన్నారు. విజేతలను అధ్యాపక, అధ్యాపకేతర బందం అభినందించారు.