Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రామ్ కోఠిలోని త్యాగరాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో నూతన అడ్మిషన్లను ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ రాఘవ రాజ్ బట్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక గాత్రం, మృదంగం, హిందుస్థానీ గాత్రం, తబల, పేరిణి నృత్యం, కూచిపూడి నృత్యం వంటి కళల్లో నాలుగేండ్ల 4 సర్టిఫికెట్ కోర్సుతో పాటు రెండేండ్ల డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 10 ఏండ్ల వయస్సు పూర్తయిన వారు అర్హులని, సర్టిఫికెట్ కోర్సు ఫీజు ఏడాదికి రూ.1100, డిప్లొమా కోర్సుకు ఫీజు ఏడాదికి రూ. 1500లు చెల్లించాలన్నారు. అడ్మిషన్ల ఇప్పటివరకు 500 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. దరఖాస్తు కోసం కళాశాల కార్యాలయం పని వేళల్లో సంప్రదించాలన్నారు. జులై నెల చివరి తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు.