Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పెండింగ్ పనులకు తక్షణమే నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ ఎ-బ్లాక్, సఫ్దర్ నగర్ ఈ-బ్లాక్‌లలో రూ.1.50 కోట్లతో వివిధ అభివద్ధి కార్యక్రమాలకు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు. డివిజన్ సమస్యలను పరిష్కరించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో అభివృద్ధి చేసుకోగలుగుతున్నామన్నారు. విద్యుత్ పోల్స్ కు సంబంధించి సమస్యను త్వరలోనే పరిష్కారం చూపుతారన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, మహిళా ప్రధాన కార్యదర్శి ముత్యాల దుర్గ, సంక్షేమ సంఘం అధ్యక్షులు జాహేద్ షరీఫ్ బాబా, రమేష్, అబ్దుల్ హమీద్, కూకట్పల్లి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏర్పుల జ్ఞానేశ్వర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు బద్రు నాయక్, సోషల్ మీడియా అధ్యక్షులు యోగి రాజు, మైనార్టీ సెల్ అధ్యక్షులు నూర్ ఖాన్, బిజినెస్ సెల్ అధ్యక్షులు సంజీవ, సయ్యద్ రియాజ్, నరసింహ మాస్టర్, సలావుద్దీన్, అస్లామ్, విష్ణు, మహబుబ్, టీఆర్ఎస్ రాజు, సుంకన్న, యాలల రాము యాదవ్, అబ్దుల్ సలీం, చాంద్ సాబ్, మాదవ చారి, రామ్ రెడ్డి, కమల్, కళ్యాణ్ నాయక్, కమ్మరి శ్రీనివాస్, మురళి, కృష్ణ, మహ్మూద్, రాంబాబు, భాస్కర్ నాయక్, నాగరాజు, మల్లేష్, అమీర్, బాబా, వెంకటమ్మ, అశోక్, ఏసు రత్నం, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.