Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
జీహెచ్ఎంసీ సర్కిల్ 18 డిప్యూటీ కమిషనర్ రంజిత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజరు కుమార్తో కలిసి మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో పర్యటించారు. ఎమ్మెల్యే కాలనీ అసోసియేషన్ సభ్యులు ఒమేగా ఆస్పత్రి నుంచి డి శ్రీనివాస్ నివాసం వరకు ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించాలని అధికారులను కోరారు. ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ కమిషనర్ దీనిపై సానుకూలంగా స్పందించి ఇంజినీరింగ్ అధికారుల సమక్షంలోనే ఫుట్పాత్ ఆక్రమణలను సరిచేసి స్థానికుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.