Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ నేత వల్లారపు శ్రీనివాస్
నవతెలంగాణ-ఓయూ
చమురు సంస్థలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని, అడ్డుఅదుపు లేకుండా ఇష్టానుసారం వంట గ్యాస్ ధరలు పెంచుతూ పోతున్నాయని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గం ఇన్చార్జ్ వల్లారపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. మార్చి నుంచి ఇప్పటి వరకు రూ.153 లకు పైగా పెంచారని, నేడు గ్యాస్ సిలిండర్ ధర రూ.1105 దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఈ ధర వెచ్చించి సిలిండర్ కొనుక్కునే పరిస్థితులు లేవని, చమురు సంస్థలు పెంచిన ధరలను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజల స్థితి గతులను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.