Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే తొలగించాలి: పీడీఎస్‌యూ
నవతెలంగాణ-అడిక్‌మెట్
ప్రభుత్వ పాఠశాల పక్కఉన్న చెత్త డంపింగ్‌ను తక్షణమే తొలగించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్యామ్ డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల పక్కనే చెత్తను డంపింగ్ చేయడం వల్ల విద్యార్థులకు విపరీతమైన దుర్వాసన వస్తుందని, ఫలితంగా వారు క్లాసులపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారన్నారు. మరోవైపు వర్షాలు కురుస్తుండటంతో దోమలు, బాక్టీరియాల వల్ల విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇంకో వైపు వర్షం వస్తే స్కూల్ ముందు మురుగునీరు నిల్వ ఉంటుందని, దీంతో విద్యార్థులు స్కూల్ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. తక్షణమే స్థానిక ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి గౌతమ్, జిల్లా నాయకులు గణేష్, శ్రీను, శ్రీకాంత్ పాల్గొన్నారు.