Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పరీక్ష ఫలితాల్లో ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బుధవారం అశోక్‌నగర్‌లోని ఏకేఎస్ ఐఏఎస్ అకాడమిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రూప్స్‌లో రాణించిన పలువురు అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ సీఈఓ శశాంక్ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఏపీ రాష్ట్రంతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు రాణించారని తెలిపారు. తమ అకాడమీకి చెందిన రాణి సుష్మిత మొదటి ర్యాంక్ సాధించిందని తెలిపారు. మొత్తం 167 గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ 2018లో నోటిపికేషన్ విడుదల చేసిందని తెలిపారు. తమ అకాడమీకి చెందిన 40 మంది గ్రూప్-1 పోస్టులకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా మొదటి ర్యాంక్ సాధించిన రాణి సుష్మిత తోపాటు ఉద్యోగాలకు ఎంపికైన శ్రీనివాస్ రాజు, కిరణ్ కుమార్, చిరంజీవి, సాయి ఈశ్వర్ యశ్వంత్, వీసా దీరాజ్తో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన సిందు ప్రియ, పవన్‌లను ఘనంగా సన్మానించారు.