Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ సి వసతిగహం రూమ్ నెంబర్ 45లో ఊడిపడుతున్న సిమెంట్ పెచ్చుల విషయంలో విద్యార్థులు బుధవారం ఆర్ట్స్ కళాశాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రెండు నెలల కిందట కూడా ఇదే వసతిగహంలో ఒక రూమ్ సిమెంట్ పెచ్చులు ఊడిపడి ప్రమాదం తప్పిందని విద్యార్థులు వాపోయారు. అలాగే సి మెస్ భవనం పైనుంచి కుర్షం కురుస్తోందని, హాస్టల్లోకి పాములు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఓయూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఇలా ఆందోళన వ్యక్తం చేస్తునట్లు చెప్పారు.
ఇక సి హాస్టల్ 45 రూమ్‌ను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్. మూర్తి పరిశీలించారు. పెను ప్రమాదం జరగకముందే ఓయూ అధికారులు పూర్తిస్థాయిలో వీటిని గుర్తించి మరమ్మతులు చేపట్టాలని కోరారు. అధికారులు విద్యార్థులకు సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.