Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షులు పరశురాం
- కోఠి ఉమెన్స్ కళాశాల ముందు నిరసన
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షులు పరశురాం అన్నారు. బుధవారం కోఠిలోని యూనివర్సిటీ కాలేజ్ ఉమెన్స్ కళాశాల ప్రధాన గేటు ఎదుట కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ 2016లో జీవో నెంబర్ 16 ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రభుత్వం మొదలెట్టిందని చెప్పారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా వెంటనే ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎం కేసీఆర్ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమ ఉద్యోగుల ను పర్మినెంట్ చేయాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ధర్మతేజ, ఉపాధ్యక్షులు టి ప్రేమయ్య, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ వినీత పాండే, డాక్టర్ ప్రియ, డాక్టర్ భాగ్యమ్మ, డాక్టర్ తిరుపతి, డాక్టర్ రవికుమార్, డాక్టర్ ఆనంద్, డాక్టర్ శ్యాంసుందర్, డాక్టర్ శైలజ, డాక్టర్ పరమేశ్వరి, డాక్టర్ రజిని, డాక్టర్ సంతోష్ రాథోడ్, అధ్యాపకులు పాల్గొన్నారు.